దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నారా? అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తాజా పరిణామాలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వ అనుమానాలు నిజమేనా? ఆప్ కీలక నేత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 1 నుంచి జైల్లోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో గతంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్లి ఏడాది గడుస్తున్న బెయిల్ లభించలేదు. దీంతో కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ రాకపోవచ్చని ఆప్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆప్ మంత్రి అతిష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది . అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని మంత్రి అతిషి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు హాజరు కావడం లేదని అతిష్ పేర్కొన్నారు. ప్రస్తుతం నియామకాల్లో, బదిలీల్లో స్తబ్దత నెలకొందని ఆమె ఎత్తిచూపారు. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగించడం కూడా కుట్రలో ఇదొక భాగమేనని అతిషి అభిప్రాయపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఢిల్లీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని.. గతంలో జరిగిన కొన్ని విషయాలను పరిశీలిస్తే.. ఇప్పుడు ఢిల్లీపై కూడా అదే కుట్ర జరుగుతుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అతిషి ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. 62 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాష్ట్రపతి పాలన భయం పట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారా లేదా ప్రభుత్వం భయపడుతుందా? అన్నది అతిషి చెప్పాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే మంచిదని.. కొత్త ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని అప్పగించి.. పరిపాలన సక్రమంగా నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ రాజీనామా చేసేలా ఆదేశించాలంటూ ఇటీవల కోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కానీ వాటిని కోర్టు కొట్టేసింది. ఇక కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలిస్తున్నారు. ఆయన సందేశాలను సతీమణి సునీతా కేజ్రీవాల్ చదవి వినిపిస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. సునీతా కేజ్రీవాల్‌నే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి అతిషి.. రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
दिल्ली की चुनी हुई सरकार को गिराने के लिए बहुत बड़ा राजनैतिक षड्यंत्र रचा जा रहा है…
दिल्ली में जल्द ही राष्ट्रपति शासन लगाने की तैयारी की जा रही है। भाजपा समझ गई है कि, वो दिल्ली में चुनाव कभी नहीं जीत सकती, तो अब दिल्ली की लोकप्रिय सरकार को ही गिराना चाहती है।
अरविंद… https://t.co/pBb1VVhigL
— Atishi (@AtishiAAP) April 12, 2024