రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అని అర్థం. అందుకే రాష్ట్రపతి పదవిని అత్యున్నత పదవిగా అందరూ భావిస్తారు. అలాంటి అత్యున్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సొంతం చేసుకున్నారు.
భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. భారత దేశానికి కాబోయే 15వ రాష్ట్రపతి ఎవరన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. సోమవారం రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటులోనూ, రాష్ట్రాల్లోనూ, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోలింగ్ జరగనుంది.
రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ఆసక్తి నెలకొంది. గత ఐదేళ్లలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 200కు పైగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో అవన్నీ చట్టాలుగా మారాయి. అయితే వాటిలో చాలా వరకు ఇంకా అమల్లోకి రాకపోవటం గమనార్హం. ఆయా చట్టాల అమలుకు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించకపోవటమే దీనికి కారణం. మరోవైపు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఐదేళ్ల కాలంలో ఆరు క్షమాభిక్ష…
అత్యంత ఉత్కంఠగా అత్యున్నత సమరం…వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు..విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా…వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన సిన్హా..ఒకప్పటి తన సొంత పార్టీపైనే ఇప్పుడు పోటీకి సై…ఊహకందని వ్యూహాలతో కాషాయదళం.మహారాష్ట్రలోని ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు వల ..రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ కోసమేనని జోరుగా ప్రచారం..దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి ఆర్టికల్ 53, 74(2) ప్రకారం రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు..రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారం..భారత రాష్ట్రపతి ఎన్నికల…
రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఉమ్మడిగా అభ్యర్థిని పోటీలో పెట్టాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఇందులో భాగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, అభ్యర్థుల విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అంతే కాదు.. విపక్షాలు అభ్యర్థిగా ఎవరు అనుకున్నా.. నా వల్ల కాదు బాబోయ్ అన్నట్టుగా.. అంతా తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా…
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్(ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 50…
ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఓవైపు ఎన్డీఏ తరఫున అభ్యర్థిని నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుండగా… విపక్షాలు సైతం ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న ప్లాన్లో ముందుకు సాగుతున్నాయి.. అందులో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. మరోవైపు.. ఎన్డీఏ అభ్యర్థి నితీష్ కుమారే అంటూ ప్రచారం సాగుతోంది.. బీహార్ సీఎంను.. ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా…