Draupadi Murmu Oath As President of India Live Updates
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రక్షక దళం గౌరవ వందనం అందించింది. ముర్ముకి 21 గన్ సెల్యూట్ చేశారు. ఆమె వెంట మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు.
మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న బాలికగా నేనేనని అన్నారని ఆమె తెలిపారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం నా వ్యక్తిగత విజయం కాదని, ఆదివాసీ, దళితుల విజయమని వ్యాఖ్యానించారు ద్రౌపది ముర్ము. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా సంకల్పంతో ముందుకెళ్లాలని ద్రౌపది ముర్ము అన్నారు.
భారత ప్రజాస్వామ్యం గొప్పది. వార్డు కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి స్థాయికి వచ్చా. రాజ్యాంగాన్ని అనుసరించి చిత్తశుద్ధితో పనిచేస్తా. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. వచ్చే 25 ఏళ్లలో దేశంలో పురగతి సాధించాలి.
50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ నా రాజకీయ జీవితం మొదలైంది.. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాలి. కార్గిల్ దివాస్ భారత్ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముర్ము. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ముర్ముతో సీజేఐ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
పార్లమెంట్ భవనానికి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ముర్ముతో ప్రమాణం చేయించనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌లు.
రాష్ట్రపతి భవన్ కు ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ద్రౌపది ముర్ము కు రాంనాద్ కొవింద్ దంపతులు స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి దూరంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్,తమిళి సై సౌందర రాజన్.
ఉదయం 8.30 గంటలకు రాజ్ ఘాట్ లో జాతిపిత మహాత్మ గాంధీ కి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. రాజఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు ఈ రోజు ఉదయం 9.22 గంటలకు ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లు పూర్తి. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు రాజఘాట్ లో జాతిపిత మహాత్మ గాంధీ కి నివాళులు అర్పించనున్న ద్రౌపది ముర్ము. రాజఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు ఈ రోజు ఉదయం 9.22 గంటలకు వెళ్లనున్న ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ భవనంకు వచ్చిన ద్రౌపది ముర్ము ను ప్రధాని మోడి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎమ్.వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా లు పార్లమెంట్ “సెంట్రల్ హాల్” కు తీసుకు వెళ్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు ఈ రోజు ఉదయం 10.10 గంటలకు చేరుకోనున్న ద్రౌపది ముర్ము. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం. భారత రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము తో ప్రమాణ స్వీకారం చేయుంచనున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్యాధికారులు, ఉన్నాతాధికారులు, త్రివిధ దళాధిపతులు భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉదయం 10.23 గంటలకు భారత 15 వ రాష్ట్రపతి ప్రసంగం. నూతన రాష్ట్రపతికి గౌరవ సూచకంగా 21 సార్లు “గన్ సెల్యూట్”. సెంట్రల్ హాల్‌లో పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం అనంతరం, సంప్రదాయరీతిలో అశ్వ శకటం లో అధికార లాంఛనాలతో రాష్ట్రపతి భవన్‌కు 10.57 గంటలకు చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వర్షం లేకపోతే రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్ట్‌లో ఉదయం 9.42 గంటలకు రాష్ట్రపతి గౌరవార్థం సంప్రదాయంగా జరిగే వేడుక కార్యక్రమం. వర్షం ఉంటే, నిర్వహించాల్సిన ఈ వేడుక కార్యక్రమం రద్దు.
29 మంది మీడియా అధిపతులకు ఆహ్వానం. 79 మంది ఫోటోగ్రాఫర్లు, టీవీ కెమెరామన్లు కు అనుమతి. మీడియా ప్రతినిధులకు 1 గంటకు పార్లమెంట్ లో ప్రవేశానికి అనుమతి.
భారత 15వ రాష్ట్రపతిగా నేడు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం. భారత రాష్ట్రపతిఅయిన అత్యంత పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము. ప్రతిభా పాటిల్ తర్వాత భారత రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము రెండవ మహిళ.