కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా కు టీఆర్ ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మా పార్టీ మద్దతు సిన్హాకే అంటూ ట్వీట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే 27న సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్ కూడా హాజరవ్వడం చర్చనీయాశంగా మారింది. అంటే యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించింది టీఆర్ ఎస్. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా జూలై…
. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గితే.. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా తన పేరును చరిత్రలో లిఖించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు.. విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి ఓకే చెప్పాయి..
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోన్న సమయంలో.. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. దోవల్ పేరును పరిశీలిస్తోంది..
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి. తాజాగా శరద్ పవార్…
రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి 14 మందితో కూడిన టీంను ఏర్పాటు చేశారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ ఉండనున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, శర్వానంద్ సోనోవాల్, అర్జున్ మేఘ్ వాల్, భారతీ పవార్, తరుణ్ చుగ్, డీకే అరుణ, రితురాజ్ సిన్హా, వానాటి శ్రీనివాసన్, సంబిత్ పాత్ర, రాజ్ దీప్…
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని కేఏ పాల్ అన్నారు. ఎకనామిక్ సమ్మిట్ పెట్టాలని కోరాని.. ఈ వారంలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు అహ్మదాబాద్ లో సమ్మిట్ ఫెట్టమని అడుగుతున్నారని.. అయితే నేను హైదరాబాద్ లో అయితేనే సమ్మిట్ పెడతా.. అని చెప్పానన్నారు. మీరు అన్నీ అహ్మదాబాద్ తీసుకెళ్తున్నారని.. ఈ విషయంలో…
దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్ళీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి కర్నాటక పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్…
ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ తరఫున మరోసారి అవకాశం దక్కించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నాలుగు స్థానాల్లో విజయసాయిరెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీవీతో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నా పై అచంచల విశ్వాసం ఉంచి రాజ్యసభకు మరోసారి పంపిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు జగన్, భారతి లకు ధన్యవాదాలు తెలిపారు. నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా…