దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్ళీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి కర్నాటక పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దేశంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారని తెలుస్తోంది.
బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్… అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కేసీఆర్ కటౌట్ తో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. దేశ్ కి నేత అంటూ ఫ్లెక్సీలు వేశారు. బెంగళూరు పర్యటనలో అనేక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. కేసీఆర్ రేపు సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వస్తారు.
దేశ్ కీ నేత అంటూ కేసీఆర్ కి స్వాగత ఫ్లెక్సీలు
ఢిల్లీకి వెళ్లి అక్కడి సీఎం కేజ్రీవాల్‌తో మంతనాలు జరిపారు. పంజాబ్‌లో సాగుచట్టాల వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు, అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందచేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్-కేసీఆర్ ఇద్దరు కలిసి ఢిల్లీ సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. స్కూల్ ఆవరణలో పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్ వివరించారు. ఢిల్లీ విద్య విధానంపై ఆరా తీశారు. పనిలో పనిగా మోడీ విద్యావిధానంపై మండిపడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. బెంగళూరు టూర్ తర్వాత కేసీఆర్ మరోసారి తమిళనాడు వెళ్లే అవకాశాలున్నాయి.
Khushbu Sundar: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..