ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారు. చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదు.ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టం.మేం ఇచ్చిన లేఖకు సమాధానం…
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల నేతలు విముఖతతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాలంటూ ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు చర్చకు రావడం లేదు మంత్రుల కమిటీ వెల్లడిస్తోంది. ఈ…
సీపీసీని అమలు చేస్తున్నారా..? అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను అమలు చేస్తున్నారా..? ఆఫీసర్స్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారా..? ఏపీలో అమలు చేయాలనుకుంటోంది ఏ పీఆర్సీ అని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేన్ని అమలు చేస్తున్నారో చెబితే మేం చర్చలకు సిద్దమని ఆయన స్పష్టం చేశారు. సీపీసీని అమలు చేస్తే.. అందులో ఉన్న మిగిలిన అంశాలనూ అమలు చేస్తారా..? అని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ మీద…
పీఆర్సీ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని సీఎస్ ను కోరామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కానీ సీఎస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీకి మా స్టీరింగ్ కమిటీ బృందం వెళ్లి లేఖ ఇచ్చింది.. దానికీ సమాధానం లేదని ఆయన తెలిపారు. సమాధానాలు చెప్పకుండా.. మమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చర్చలకు వెళ్లమని మాపై ఒత్తిడి తేవాలని…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల…
ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని ఆయన వెల్లడించారు. చర్చలకు…
ఏపీలో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడింది. అంతేకాకుండా సమ్మెకు పిలునివ్వనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ లు విజయవాడ రెవెన్యూ భవన్ కు చేరుకున్నారు. రేపు సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీ…
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు.…
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు…