ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారు.
చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదు.ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టం.మేం ఇచ్చిన లేఖకు సమాధానం చెప్పకుండా మళ్లీ చర్చలకు రమ్మంటే ఎలా..?మేం చర్చలకు వెళ్లినా.. రావడం లేదని ప్రభుత్వం విమర్శిస్తోంది.చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలూ ఈ పీఆర్సీ వద్దనే చెబుతారు.
మేమే చర్చలకు వెళ్లినప్పుడు.. మిగిలిన వాళ్లు చర్చలకు వెళ్తే తప్పేంటీ..? వెళ్లనీయండి. ఉద్యోగుల్లో చీలిక తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నం విఫలం కాక తప్పదు.. మేమంతా ఒకటే అని బొప్పరాజు స్పష్టం చేశారు.