ఏపీలో ఎట్టకేలకు పీఆర్సీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల పాటు సుమారు 10 గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన అంశాలు హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన…
ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారు. చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదు.ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టం.మేం ఇచ్చిన లేఖకు సమాధానం…