Andhra Pradesh: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది.…
ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం…