డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాక్ స్టార్ యష్‌తో కలిసి.. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కూడా అంతే క్రెడిట్ దక్కించుకుంది. దాంతో కెజియఫ్ తర్వాత అదే రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు హోంబలే అధినేతలు. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాను భారీ…
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల.. అతని తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే తీర్చిదిద్దేందుకు దర్శకులు చాలా కసరత్తులే చేస్తున్నారు. కథ పరంగానే కాదు, నటీనటుల్ని కూడా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ఆయా భాషా పరిశ్రమల్లో పేరుగాంచిన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా NTR31 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది. కొరటాల శివతో NTR30 చేస్తోన్న తారక్.. ఆ తర్వాత…
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అంటే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ అప్పులన్నీ తీరిపోవడమే కాదు దశాబ్దం తర్వాత హిట్ కొట్టాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అనే చెప్పాలి. తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను విజయతీరాలకు తీర్చింది లోకేశ్ అయితే అందులో పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్…
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం…
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, క్రేజీ దర్శకులతోనే జోడీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తోన్న తారక్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్…
కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. యశ్ సినిమా కోసం హీరోయిన్ పాత్రకు పూజాని ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.…
భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. జాతీయంగా అనూహ్యమైన క్రేజ్ గడించిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. పోస్టర్లతో ఊరిస్తోన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. నిజానికి.. మే చివరి వారంలోనే ‘సలార్’ టీజర్ రావాల్సింది కానీ, షూటింగ్ ఆలస్యం అవ్వడంతో కుదరలేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్…
ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కూడా సినిమా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత నిర్మించబోతున్నారట. అలాగే ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ టైటిల్ లాక్ చేసినట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏ డైరెక్టర్‌తో ఉండబోతోంది..! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టైటిల్ ఏంటి..! ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయబోతున్నారు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్న విషయం విదితమే.. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ తో కొద్దిగా రిలాక్స్ అయిన తారక్ కుటుంబంతో కలిసి సింగపూర్ కు వెళ్ళాడు. ఇక వెకేషన్ నుంచి తిరిగి రాగానే సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో ఎన్టీఆర్ 30 చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు…