NTR 31: ఇప్పటివరకూ అనౌన్స్‌మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇండియన్ సినిమా ఏదైనా ఉందా అంటే ఈ మూవీనే. ఫైర్ హౌస్ ల్లాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేస్తున్నాం అనగానే పాన్ ఇండియా రేంజులో బజ్ క్రియేట్ అయ్యింది. మే 20న మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎప్పుడైతే బయటకి వచ్చిందో ‘ఎన్టీఆర్ 31’ మూవీ పాజిటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ అయ్యేలా చేసింది. 2023 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వయోలెన్స్ పీక్ స్టేజ్ లో ఉండబోయే ఎన్టీఆర్ 31 సినిమాలో తారక్, డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో కాగా, ఇంకొకటి విలన్ క్యారెక్టర్. హీరో క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ నెగటివ్ క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ కి యాంటి ఫాన్స్ కూడా ఫిదా అవుతూ ఉంటారు.
క్యారెక్టర్ లో కొంచెం నెగటివ్ టచ్ ఉంటే చాలు ఆ రోల్ ని ఎన్టీఆర్, తన యాక్టింగ్ తో ఏ స్థాయికి తీసుకోని వెళ్తాడో ఇప్పటికే చాలా సార్లు చూసాం. ఈవిల్ స్మైల్, సెటిల్డ్ వాయిస్ తో ఎన్టీఆర్, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని స్టన్ చేస్తాడు. ఇంతటి పెర్ఫార్మర్ ప్రశాంత్ నీల్ చేతిలో పడుతున్నాడు అంటేనే, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకో రేంజులో ఉండబోతుందని అర్ధం. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసే ప్రశాంత్ నీల్, తారక్ ని ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి వాయిదాలు పడకుండా, ఇప్పటికే అనౌన్స్ చేసినట్లు మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్ళిపోయి… రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాలని ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటున్నాడు కానీ ప్మరస్రితుత పరిస్థితులు చూస్తుంటే అది అంత ఈజీగా అయ్యే పనిలాగా కనిపించట్లేదు.
ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యి ఉంటే ‘ఎన్టీఆర్ 31’ డిలే అవ్వకుండా ఉండేది. కొరటాల శివ డిసెంబర్ నెలలో ఎన్టీఆర్ 30 సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్తాడు అనే విషయంలో కూడా ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదు. ఒకవేళ ఎన్టీఆర్ కొరటాల సినిమా డిసెంబర్ లో స్టార్ట్ చేసినా, మూడు నెలల్లో పాన్ ఇండియా సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయడం అనేది కష్టమైన పని. కనీసం ఆరు నెలల సమయం షూటింగ్ కే పోతుంది అంటే జూన్ వరకూ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా షూటింగ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక నెల రెస్ట్ తీసుకున్నా, లుక్ పరంగా వర్క్ చేయడానికి టైం తీసుకున్నా… జూలై లేదా సెప్టెంబర్ నెలలో ‘ఎన్టీఆర్ 31’ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇంతకన్నా ముందే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలైతే కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ విషయంలో అద్భుతం చేసినట్లే.