Prabhas:ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే కాదు.. ది మోస్ట్ బిజీయెస్ట్ హీరో ఇన్ ది టాలీవుడ్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. వీటిలో ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ సినిమా సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఇవి కాకుండా స్పిరిట్ లైన్లో ఉంది. అందరు స్టార్ డైరెక్టర్లు.. ఇక ఈ సినిమాలన్నింటిపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అన్నిటి కన్నా సలార్ కోసం అయితే అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ సినిమాతో దేశాన్ని మొత్తం షేక్ చేయించిన ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో చేస్తున్నప్పటికీ.. ఆ కటౌట్ ను ఓ రేంజ్ లో చూపించే దర్శకుడు ఇతడేనని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక దాన్ని నిజం చేస్తూనే ప్రభాస్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్.. ప్రశాంత్- ప్రభాస్ కాంబో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
ఇక అయితే ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి అనగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావణం అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అయితే సలార్ కాంబో అని చెప్పడంతో ప్రభాస్ తో మరోసారి ప్రశాంత్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. రావణ బ్రహ్మ కథతో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇక ఈ వార్త ప్రభాస్ అభిమానులకు కిక్కించే వార్తే కానీ, ఇంకా సలారే పూర్తి కాలేదు. దాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి.. మిగతా నాలుగు సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేయాలి.. ఎప్పుడు రావణం వద్దకు రావాలి. ఇవన్నీ అయ్యే పనులుగా కనిపించడంలేదే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.