నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రకాశం జిల్లాలో విషాదంగా మారింది.. పెళ్లి చేసుకుని నెల దాటిందో లేదో.. అప్పుడే ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ప్రియాంక-మహానందికు వివాహం జరిపించారు పెద్దలు.. ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు మహానంది.. అయితే, వారి కుటుంబంలో కలహాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.. దీంతో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో విషాదం నెలకొంది.. కుటుంబ కలహాల నేపథ్యంలో నవ వధువు ప్రియాంక నిన్న ముక్తినూతలపాడులో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. భార్య మరణవార్త తెలిసి భర్త పొదిలి మహానంది.. గుండ్లకమ్మ ప్రాజెక్టు లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే.. సమాజంలో మార్పు.. వారి చరిత్ర చించేయాలి..!