AP Crime: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..! నిండా ముంచిన మనీ సర్కులేషన్ స్కీం యాప్..
- సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశ..
- మనీ సర్కులేషన్ స్కీం యాప్‌ల బారినపడుతున్న ప్రజలు..
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందచ్చన్న ఆశతో పెట్టుబడి పెట్టి నిండా మునిగారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కొందరు ప్రజలు మనీ సర్కులేషన్ స్కీం యాప్‌ల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందచ్చన్న ఆశతో ఏది నిజమో ఏది అబద్దమో గ్రహించలేక పోతున్నారు. అయితే, కోట్ల రూపాయలలో ప్రజల నుంచి డబ్బులు కట్టించుకొని బోర్డులు తిప్పేస్తున్నాయి మనీ సర్కులేషన్ స్కీం యాప్ లు.. ఎవరికి చెప్పుకోవాలో.. ఏమి చేయాలో తెలియక ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్న ఘటన ప్రకాశం జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.
Read Also: Italy: భారతీయ కార్మికుడి మృతి తీరుపై ప్రధాని మెలోని ఆవేదన.. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు, మార్కాపురం మండలాల మరియు పరిసర ప్రాంతాలలో మై క్వీన్ అనే సంస్థ ప్రజలకు శతగోపం పెట్టింది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చంటూ అమాయక ప్రజలకు మై క్విన్ అనే మనీ సర్కులేషన్ స్కీం సంస్థ వలవేసింది. అత్యధికంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, చిరు వ్యాపారులే మైక్ క్విన్ మనీ సర్కులేషన్ యాప్ సంస్థకు టార్గెట్ గా మారారు. వంద రూపాయలు పెడితే 24 గంటల్లో 700 రూపాయలు ఇస్తామని మై క్వీన్ ప్రజలకు ఆశ చూపించి ముంచేసింది.. 24 గంటల్లో పెట్టిన పెట్టుబడికి ఏడు రెట్లు లాభాలు పొందవచ్చన్న ఆశతో ప్రజలు ఎగబడి డబ్బులను మైక్వీన్ లో పెట్టుబడి పెట్టారు. అయితే మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీం యజమాని ఎవరో, ఎక్కడుంటాడో కూడా ఎవరికీ తెలియదు.
Read Also: Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ
ఈ సంస్థ చెన్నై కేంద్రంగా నగదు లావాదేవీలు కేవలం ఆన్‌లైన్ ద్వారానే జరిపిందని ప్రాథమిక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. మొదట ఈ మై క్వీన్ యాప్ లింకు ద్వారా సంస్థలోకి అడుగు పెట్టిన వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేస్తారు. తర్వాత ఒక్క రూపాయి కడితే 24 గంటల తర్వాత ఒక రూపాయికి 7 రూపాయలు సంస్థ చెల్లిస్తుందని చెప్పడంతో మై క్వీన్ లో అడుగుపెట్టిన వాళ్లు మరొకరికి సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిగా మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీమ్ లో వేళల్లో భాగస్వాములుగా మారిపోయారు.. చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు అప్పులు చేసి మరి కోట్లల్లో మైక్విన్ మనీ సర్కులేషన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టారు. గత కొద్దిరోజులుగా ఈ మై క్వీన్ మనీ సర్కులేషన్ స్కీం సంస్థ నగదు లాభాదేవీలను నిలిపివేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు.. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని నిశ్శబ్దంగానే ఉండిపోయారు. ఏ ఒక్క బాధితుడు కూడా ఒక్క ఫిర్యాదు అంటే ఒక్క ఫిర్యాదు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. అత్యాశకు పోయి ఇటువంటి సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు…
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?