అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలంపై వేసిన మార్కు గురించి పునరాలోచన చేయాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి ప్లాట్కు అధికారులు మార్క్ చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇలా చేస్తే కనుక కేబీఆర్ పార్క్ చుట్టూ, సమీపంలో జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ చిక్కులతోపాటు యూటర్న్ లకు అవకాశం లేకుండా సాఫీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
Dr Bhramaram: సంతాన లేమి ‘డాక్టర్ భ్రమరం’గా వెన్నెల కిషోర్!!
అయితే, కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ఉన్న 100 ఫీట్ల రోడ్డును రూ. 120 ఫీట్లకు విస్తరించడానికి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో భాగంగా సినీ హీరో బాలకృష్ణ ఇంటిలో కొంతభాగం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖరరెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు, బడా వ్యాపారులకు సంబంధించిన స్థలాలు భూసేకరణలో ఉన్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణలో తన ప్లాటుకు చెందిన భూమిలో ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 30 అడుగులు భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను చంద్రశేఖర్ రెడ్డి కోరారు.