Prajavani Program: నేడు గాంధీభవన్ లో మంత్రుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్‌లో ఉంటారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా.. వారానికి (బుధ, శుక్ర) ఇద్దరు మంత్రులు తప్పకుండా గాంధీ భవన్ కి హాజరుకావాలనే నేపథ్యంలో మొదటి రోజు (బుధవారం) ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కాగా.. రెండో రోజు (శుక్రవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇవాళ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
Read also: Star Heros : ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిఉన్న తెలుగు హీరోలు వీరే..
ప్రజావాణి కార్యక్రమంలో మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి కానీ.. అది తప్పనిసరి కాదు కాబట్టి మంత్రులు కార్యక్రమానికి హాజరు కావడం అరుదుగా మారింది. అది కాస్త ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, మంత్రుల మధ్య దూరం పెరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దీంతో వారంలో రెండు రోజులు బహిరంగ విచారణకు మంత్రి హాజరయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, వారంలో రెండు రోజులు ఓ మంత్రి తప్పనిసరిగా బహిరంగ విచారణకు హాజరుకావాలని సూచించారు. దీనికి తోడు ప్రజావాణిపై రోజురోజుకూ నెగెటివ్ ఇంప్రెషన్ పెరిగిపోవడంలో మంత్రులు చొరవ తీసుకోవాలని, ప్రజావాణిలో పాల్గొని ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి మంత్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రతి బుధ, శుక్రవారాల్లో జరిగే ప్రజా వాణి కార్యక్రమంలో మంత్రి తప్పకుండా పాల్గొంటారు. ఈ సంప్రదాయాన్ని మొదటగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించిన విషయం తెలిసిందే..
Israel PM Netanyahu: మా పోరాటం హెజ్‌బొల్లాపై.. లెబనాన్ ప్రజలపై కాదు