కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…