Malla Reddy: ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. శామీర్ పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని…