సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు..
పోసానికి ఊరట లభించింది.. ఇవాళ లేదా రేపు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.. ఇవాళ సీఐడీ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజురు చేసింది గుంటూరు కోర్టు.. దీంతో, ఆయనకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయ్యింది..