Etela Rajender : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల,…