Telangana : తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం”గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి తన నిబద్ధతను మళ్ళీ ఉద్ఘాటించిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మహా శివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ఆలయంలోని భక్తులతో ముచ్చటించి.. అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌లో హెల్త్ చెకప్ చెపించుకున్నారు. దర్శనం అనంతరం…
బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు.…
Ponnam Prabhakar : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్ లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల…
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుగా లేకపోయినా, గత పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. Read…
Ponnam Prabhakar : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను…
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం అని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది రీసర్వే కాదని, ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే అని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లోని మూడు పదవులలో…
దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాంగ్ డైరెక్షన్లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నామని ఎద్దేవా చేశారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండన్నారు. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి…
బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు.…