Ponnam Prabhakar : హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ డిఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు…
TPCC Protest: హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కుల గణన అజెండా…
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన…
Mancherial: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు మంచిర్యాల జిల్లాను సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఈ ఐదుగురు నేతలు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి బృందం బయలుదేరి, ఉదయం 11 గంటలకు మంచిర్యాలకు…
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టి టీమ్స్ వాటిని క్లియర్ చేసింది. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో…
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్‌లో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేడు 17,263 చాకధరల దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, మైనార్టీల స్థానం, విద్యుత్ సబ్సిడీలు, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% గా ప్రకటించడం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.…
Ponnam Prabhakar: యాదగిరి గుట్ట టెంపుల్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మా జిల్లా దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. కానీ, ఎక్కడా అభివృద్ధి జరగలేదు అని తెలిపారు.
Ponnam Prabhakar: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు.