Bandi sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొంగులేటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని స్పష్టమైనప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. అలాంటి నేతకు బిఆర్ఎస్తో సంబంధాలు తెగిపోయాయ్. ఇప్పుడు ఆయన ఏ పార్టీ వైపు వెళతాడన్నది ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ల నుంచి బిఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో…పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ…2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి పొంగులేటిని పార్టీ అధినేత కేసిఆర్ దగ్గరకు రానివ్వడం లేదన్నది జనమెరిగిన…
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేనప్పుడు..
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. జూపల్లి , పొంగులేటి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు.