రాష్ట్ర ఫ్రభుత్వం చేస్తున్న అవినీతిని గొంతు విప్పడానికి వనపర్తి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ వనపర్తిలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత రాష్ట్ర ప్రజలు ఆత్మ గౌరవాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాదించుకున్నాక కన్నీళ్లు మిగిలాయని, వేలాది మంది బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని ఆయన అన్నారు. మీ ఇద్దరు ఎంపీలుగా వుండి పోరాడితే తెలంగాణ రాష్ట్రం రాలేదు… కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read : KKR vs CSK: చెమటోడుస్తున్న కేకేఆర్.. తొలి 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
అంతేకాకుండా.. ‘ రైతులను మరిచి మీ నల్ల దనాన్ని తెల్లదనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు.. కాలేశ్వరం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఒకే ఫ్రారంబించినా మీస్వార్థ ప్రయోజనాలకోసం కాలేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసినా పాలమూరు ప్రాజెక్టును మరిచారు. అకాల వర్షానికి రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు తెలియడం లేదా.. రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించి మల్లీ మీరు సియం కావాలని చూస్తున్నారు… వేలాది కోట్లు రైతులను తెలంగాణ బిడ్డలను ముంచి సంపాదించుకున్నావ్.. కేసీఆర్. నిన్ను కలిసిన కర్నాటక జెడిఎస్ కుమారస్వామి పరిస్థితి ఏమయ్యిందో నీవు గమనించు కేసీఆర్.. పైన దేవుడున్నాడు అధికారం ఎవ్వడిసొత్తు కాదు… కేసీఆర్. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పనుల వల్లే ఇప్పటికీ ప్రజలు వారిని గుర్తించారు…
నీపతనం ప్రారంభమైంది……ప్రజలే నీకు గుణపాఠం చెప్తారు.. చట్టానికి వ్యతిరేఖంగా వ్యవహరించి వాలంటేరీ రిటేర్ మెంట్ తీసుకున్న. ఎక్స్ సీఎస్ సోమేష్ కుమార్ కు మళ్లీ పదవి ఇవ్వడం ఎందుకు… ఇక్కడ తెలంగాణ వారు లేరా… అధికారం వుందికదా అని విర్రవీగితే బారీ మూల్యం చెల్లించుకుంటావు…. మేము తీసుకునే నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తాం..’ అని పొంగులేటి ప్రసంగించారు.
Also Read : Jupally Krishna Rao : దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు… ఎంత మందికిచ్చారు