ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కలిసి భేటీ అయ్యారు. రెండు గంటలుగా.. పొంగులేటి నివాసంలో పొంగులేటి, జూపల్లి తో బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీ కొనసాగింది. పార్టీలోకి రావాలని పొంగులేటి, జూపల్లిలను ఈటల రాజేందర్ కోరారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈటల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : Trivikram: సంయుక్తను వదలని త్రివిక్రమ్.. ఈసారి కూడా గట్టిగానే..?
మీ దృష్టిలో ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి మీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించే విధంగా అమిత్ షా, నడ్డా తో మాట్లాడుతామని, అందరం కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈటల వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మీకు ఎదురైన సమస్యలు, అవమానాలు మాకు తెలుసునని, బీజేపీలో ఆ అవమానాలు ఉండవన్నారు ఈటల. ఈ చర్చల్లో పార్టీలో చేరికపై బీజేపీ బృందంకు పొంగులేటి, జూపల్లిలు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. త్వరలో తమ అనుచరులతో మాట్లాడి నిర్ణయం చెబుతామని పొంగులేటి, జూపల్లి చెప్పారు.
Also Read : DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది