ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా పార్టీలోనే ఉంటూ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అయితే.. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఝలక్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో.. బీఆర్‌ఎస్ పార్టీకి 300 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మాజీ ఎంపీటీసీలు,సర్పంచ్ లు, సోసైటి డైరెక్టర్లు ఉన్నారు. అయితే.. 8 సంవత్సరాల నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ వాడుకొని వదిలేశారని పొంగులేటి అనుచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైన పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందని ఆయన పొంగులేటి వ్యాఖ్యానించారు.
Also Read : Dubai: టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచర్ ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్!
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన పొంగులేటి వర్గీయులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డైలామాలో ఉన్నామని, ఇప్పటి నుండి పొంగులేటి కార్యచరనే మా కార్యచరణ అని స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోవటానికి సైనికుల్లా పనిచేస్తామని వారు తెలిపారు. బీఆర్‌ఎస్ డౌన్ డౌన్ అంటూ పొంగులేటి వర్గీయులు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. పొంగులేటి తో పాటు జూపల్లి కృష్ణారావును సైతం బీఆర్‌ఎస్ అదిష్టానం పార్టీ నుంచి తొలగించింది. దీంతో ఒకేసారి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేయడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే.. పొంగులేటి, జూపల్లిలు ఏ పార్టీ కండువా కప్పుకుంటారో అనేది ఇంకా ప్రకటించలేదు.
Also Read : Dubai Car Number Plate: కారు నెంబర్ కోసం రూ.122 కోట్లు ఖర్చు.. వేలంలో గిన్నిస్ రికార్డ్