ఖమ్మం సత్తుపల్లి నుండి 2018లో బీఅర్ఎస్ నుండి టికెట్ ఆశించి భంగపడిన నేత మట్టా దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే నెలలో పార్టీ మార్పు పై ప్రకటన ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్నది మాత్రం బీఅర్ఎస్ పార్టీలోనేనని, రాబోయే కాలంలో ప్రజల నిర్ణయంను బట్టి పార్టీ మార్పు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలంతా తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వటానికి సిద్దంగా ఉన్న అంటూ తెల్చి చెప్పిసిన మట్టా దయానంద్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో విబేధాలు లేవన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. అపోహలు ఉన్న తొలగిపోతాయని, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవన్నారు.
Also Read : AjithKumar: ప్రియ’సఖి’ బిగి కౌగిలిలో నలిగిపోయిన అజిత్.. దిష్టి తగేలేనేమో
10 ఏళ్లుగా పొంగులేటితో అనుబంధం ఉందని, చిన్న చిన్న వాటివల్ల పొంగులేటికి తనకు ఇబ్బందులు ఉండవన్నారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే జిల్లాలో 10 కి 10 సీట్లు ఖాయమన్నారు. ప్రజల్లో మనం ఉండేదనిబట్టి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాయి తప్ప ఇప్పుడున్న ఏ పార్టీలు సొంత నిర్ణయాలు తీసుకునేందుకు అవకశాలు లేవన్నారు. ప్రజలకు ఎవరిమీదా అభిమానం ఉంటుందో వారికే సీటు ఇవ్వటానికి పార్టీలు రెడీగా ఉంటాయని, ఎవరితో ఇప్పటివరకు మాట్లాడలేదు.. కాంగ్రెస్ ను కూడా ఇంకా అప్రోచ్ అవ్వలేదన్నారు. పదవి ఉన్న లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటానని, పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే బావుంటుందన్నారు.
Also Read : MM Keeravani: స్టార్ హీరోస్ తో కీరవాణి సెంటిమెంట్!