కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.
CM Revanth Reddy: రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
AP Deputy CM Pawan Kalyan Chamber: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే రోజు ఖరారైంది. జూన్ 19వ తేదీ బుధవారం రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న శాఖలను తమకు…
Rahul Gandhi Sensational Comments Stock market Scam: స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారింది. లోక్ సభ ఎన్నికల తరువాత భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, మరియు ప్రభుత్వ అధికారులు పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చారని ఆరోపించారు. ఇక దీని పైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణను కోరారు రాహుల్ గాంధీ. మరో వైపు బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, లోక్…
సీఎం కేజ్రీవాల్ ఈరోజు మళ్లీ తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. ఈరోజు తో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. మరొకవైపు అనారోగ్యం కారణంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేశారు . ఆ పిటిషన్ సుప్రీం…
తెలుగు చిత్రసీమలోనే కాదు, ప్రపంచ చలనచిత్రసీమలోనే ఓ అరుదైన అద్భుతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి అయిన మే 28వ తేదీ అభిమానులకు ఓ పర్వదినం. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో కన్ను తెరచిన యన్టీఆర్, తరువాత జనం మదిలో ‘అన్న’గా నిలచి జేజేలు అందుకున్నారు. ఆయన నటజీవితం, రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రల్లో అలరించిన ఘనత యన్టీఆర్ సొంతం. జానపదాల్లో…
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రాబల్యం తగ్గుతోంది. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1957 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. కానీ 2019లో ఈ సంఖ్య కేవలం నలుగురు స్వతంత్ర ఎంపీలకు తగ్గింది. దేశంలో అత్యల్ప స్వతంత్ర ఎంపీల సంఖ్య 2014లో కేవలం ముగ్గురు మాత్రమే నిలిచారు.
బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.