Nutan Naidu: బిగ్ బాస్ ద్వారా చాలామంది ఫేమస్ అయితే కామన్ మ్యాన్ అనే పేరుతో లోపలికి వచ్చి ఫేమస్ అయ్యాడు నూతన్ నాయుడు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో హడావుడి చేసిన ఆయన తర్వాత లగడపాటికి సర్వేలు చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరగడంతో అక్కడ కూడా సుపరిచితమే. ఓ దళిత యువతికి శిరోముండనం చేసిన కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పదం కూడా అయ్యారు.
Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్..
చాలా కాలం నుంచి అసలు వార్తల్లో కూడా లేకుండా పోయిన నూతన్ నాయుడు షర్మిల సమక్షంలో ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్ అవుతుంది. ఆయనకు కండువా కప్పిన షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి సాదర స్వాగతం పలికారు. నిజానికి కామన్ మ్యాన్ అనే పేరుతో ఆయనని హౌస్ లోపలికి సెకండ్ సీజన్ లో తీసుకురావడం చర్చనీయాంశమైంది. చాలా పలుకుబడి కలిగిన వ్యక్తిగా ప్రచారం ఉన్న అతన్ని కామన్ మాన్ గా లోపలికి పంపడం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పుడు నూతన్ నాయుడు కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు ఎందుకు యాక్టివ్ అయ్యారు అనేది తెలియాల్సి ఉంది.
MEDCY IVF CENTER : పురుష వంధ్యత్వం, ఐవీఎఫ్.. సవాళ్లు, పరిష్కారాలను అర్థం చేసుకోవడం ఎలా..?