తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కానున్నారు.
రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతం అన్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను.. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు.
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు…
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్…
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీవీ నరసింహారావుకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Ambati Rambabu : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనలు వ్యక్తం చేసింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు మీరు మాకు ఓటు వేయండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. తగ్గించడం సంగతి దేవుడు ఎరుగు ,చార్జీల మోత మోగుతుందన్నారు అంబటి రాంబాబు. వైసీపీకి 11…
Vijay On Amit shah: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు, ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ..…
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.