ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.
తాజాగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు ఓసారి చూద్దామా.. also read: Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల…
Ex MLA Aroori Ramesh: వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలచివేస్తున్నాయి.
Mohan Babu Letter Goes Viral: ఏ పార్టీ వారైనా తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే దృష్టి పెట్టాలని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి అస్సలు లాగొద్దన్నారు. శాంతి, సౌభ్రాతృత్వాలను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ లేఖ చేశారు. ‘ఈ మధ్య కాలంలో నా పేరుని…
మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది... జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప…
ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె్ల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు.…
రాజకీయాల నుంచి గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆయన ప్రకటించారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు జయదేవ్ వెల్లడించారు. తాజాగా ఇదే అంశంపై తల్లి గల్లా అరుణకుమారి స్పందించారు. పార్లమెంట్ను గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల శాసించే వారని తెలిపారు. నీతి, నియమాలతో పెరిగిన కుటుంబం తమదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్లో సీటు కోసం ప్రయత్నం చేస్తే రాలేదని.. అప్పుడు టీడీపీలో జాయిన్ అయినట్లు గుర్తుచేశారు. కేవలం…
బీహార్ పరిణామాలతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతుందో అర్థం కాక నేతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు సింగిల్గానే లోక్సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా ఇండియా కూటమికి రాంరాం చెప్పబోతున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఈ అనిశ్చితితో కూటమి నేతలు కన్ఫ్యూజ్తో తలలు పట్టుకుంటున్నారు. క్షణక్షణం రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. లేటెస్ట్గా నితీష్ ఇస్తు్న్న ట్విస్టుతో నేతలంతా అయోమయానికి గురయ్యారు.
బీహార్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తాజా పరిణామాలు, జేడీయూతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కూడా చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.