ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ? పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..! విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో…
పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ సన్నీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడంతో మరోసారి పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. నేతలు బుజ్జగించినా ఆయన వినలేదు. రాజీనామాపై పునరాలోచన లేదని చెప్పిన సిద్ధూ సడెన్ గా ఈ రోజు ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్…
కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయా? సమన్వయం లేక నాయకులే బజారున పడుతున్నారా? ఆధిపత్యపోరు వైఎస్ విగ్రహాన్ని కూల్చేవరకు వెళ్లిందా? లోకల్ సెగలు.. ఇంకెలాంటి మలుపు తిప్పుతాయో పార్టీ వర్గాలకు బోధపడటం లేదా? ఏ విషయంలో పార్టీ నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది? లెట్స్ వాచ్! కోడుమూరు వైసీపీలో వర్గపోరు సెగలు..! కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడది పరిషత్ ఎన్నికల…
అప్పట్లో ఇంఛార్జ్‌గా ఉన్న నాయకుడు.. తిలకం దిద్ది మీకే పోస్ట్ అని హామీ ఇచ్చారు. ఇంతలో ఆ ఇంఛార్జే మారిపోయి కొత్త నేత వచ్చారు. అసలే పాత, కొత్త ఇంఛార్జుల మధ్య ఆధిపత్య పోరు ఉండటంతో గత హామీలపై ఆ ఎఫెక్ట్ పడింది. పరిషత్ ఫలితాల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గం ఏంటో.. వారెవరో ఇప్పుడు చూద్దాం. దువ్వాడ, పేరాడ మధ్య నందిగాం పంచాయితీ! శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో నాయకులెక్కువ. వారి మధ్య…
పాపం….! ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను చూస్తున్న పక్కవారు అంటున్న మాట ఇది. కొంతమందికి ఎన్నేళ్ల సీనియార్టీ ఉన్నా పదవులు రావు. ఇంకొందరికి ఎన్ని పదవులు ఇచ్చినా… వాళ్లకి అవి దక్కడం లేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్లకి.. వాళ్లతోపాటు మిగిలిన వారికీ పదవులు ఆగిపోతున్నాయట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఐరన్ లెగ్గుల కథ చూడాల్సిందే. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా బీరేంద్ర..!కాణిపాకం ఆలయ ఛైర్‌పర్సన్‌గా దయాసాగర్ రెడ్డి భార్య..!స్థానికులు అడ్డం తిరగడంతో ఆగిన ప్రమాణ…
పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో చర్చగా మారాయి.. రచ్చ రచ్చ అవుతోంది. స్వపక్షంలోని వ్యతిరేకులకు ఛాన్స్ ఇవ్వకుండా సొంతవారితో కమిటీలు నింపేస్తున్నారట ఎమ్మెల్యేలు. అవకాశం దక్కని నేతలు.. వారి అనుచరులు గుర్రుగా ఉన్నారట. ఈ అసంతృప్తి ఎన్నికల నాటికి ఏ విధంగా భగ్గుమంటుందో అనే టెన్షన్ కేడర్‌లో ఉందట. కమిటీల ఏర్పాటులో అగ్గి రాజేస్తోన్న వర్గపోరు..! ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ ప్రస్తుతం వలస నేతలు, కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. అప్పట్లో టీడీపీ…
ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన ఆ మంత్రికి సొంతపార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? జిల్లాస్థాయి కీలక పదవిలో ఉన్న నేత రాజీనామాకు సిద్ధపడ్డారా? ప్రతిపక్ష పార్టీల విషయంలో చేయాల్సిన రాజకీయాలు సొంతపార్టీలో చేసి అధిష్ఠానాన్ని ఇరుకున పెడుతున్నారా? కమిటీల కూర్పుతో మరోసారి భగ్గుమన్న విభేదాలు! టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల కూర్పు.. ప్రకటనలు కొన్నిచోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా నేతల రాజీనామాల వరకు వివాదాలు వెళ్తున్నాయి. దీనికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండల కమిటీ ఒక ఉదాహరణ. కమిటీ…
పంజాబ్ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుందని అనుకున్నా, సిద్ధూ పేరును తెరపైకీ తీసుకొస్తే పూర్తిగా వ్యతిరేకిస్తానని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పడంతో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎన్నుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెరపైకి అనేకమంది పేర్లు వస్తున్నాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, సుఖ్ సిందర్ సింగ్ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌల్ భట్టల్ పేర్లు తెరమీదకు…
ఆ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది? ‘గ్రేటర్’ ఎన్నికల తర్వాత మనస్పర్థలతో గ్యాప్ బాగా పెరిగింది. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేయడం ఇష్టంలేక కొత్త ఎత్తులు వేస్తున్నారట. తాజా అరుపుల వెనక అసలు కథ ఏంటి? మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్‌లో తారాస్థాయికి వర్గపోరు! హైదరాబాద్ ASరావునగర్ డివిజన్ టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారడంతో పార్టీలో వర్గపోరు మరోసారి చర్చగా మారింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్…
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు సోనూసుద్ సినీ నటుడుగానో.. విలన్ గానో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనాను అరికట్టేందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా లాక్డౌన్ విధించారు. ఇది మంచి నిర్ణయమే అయినా ఆ సమయంలో కొందరి పాలిటశాపంగా మారింది. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో సోనూసూద్ వారికి అండగా నిలిచాడు. ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి వాళ్లను తమ సొంత…