టీమిండియా దిగ్గజ బౌలర్ హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే హర్భజన్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్వయంగా హర్భజన్ వెల్లడించాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయాలని భావిస్తున్నానని.. అయితే అది రాజకీయాల రూపంలోనా లేదా ఇతర రూపంలోనా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భజ్జీ తెలిపాడు. తనకు రాజకీయ రంగం గురించి…
మెట్రో మ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీధరన్ ప్రకటించారు. తనకు తత్వం బోధపడిందని.. ఎన్నికల్లో పోటీ చేసి తగిన గుణపాఠం నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని… ఇంకా రాజకీయాల్లో ఉండటం, రాజకీయంగా కెరీర్ కొనసాగిస్తే మరింత ప్రమాదంలో పడతానని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతగా ఉండటం తనకు ఇష్టం లేదని.. రాజకీయాలను చేయడం తన డ్రీమ్ కూడా కాదని శ్రీధరన్ స్పష్టం చేశారు. Read Also:…
తాండూరు టీఆర్‌ఎస్‌లో తన్నులాటలకు ఫుల్‌స్టాప్ పడదా..? తెగేవరకు లాగడమే అక్కడి నేతల లక్ష్యమా..? గతంలో జరిగిందేంటి..? ఇప్పుడూ అలాగే జరగాలేమోనని కేడర్ ఎందుకు అనుకుంటోంది? నేతలను నియంత్రించడం సాధ్యం కావడం లేదా? తాండూరు టీఆర్‌ఎస్‌లో తగ్గేదే లే..! ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీఆర్ఎస్ వర్గపోరు..రోజుకో రకంగా రచ్చ లేపుతోంది. సద్దుమణిగింది అనుకుంటున్న సమస్య.. మళ్లీ మొదటికి వస్తున్న పరిస్థితి. ఆధిప్యతపోరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే…
లెక్కలో తేడా వచ్చింది.. అనుచరులపై ఎమ్మెల్యేకు కోపం వచ్చింది..! కుర్చీలో నుంచి దించేసేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ విషయం బయటకు గుప్పుమనడంతో కోదాడ టీఆర్‌ఎస్‌లో చెవులు కొరుకుడు ఎక్కువైంది. అదేంటోఈ స్టోరీలో చూద్దాం. వైరి వర్గాలుగా ఎమ్మెల్యే.. మున్సిపల్ ఛైర్‌పర్సన్..! సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా కాక రేపుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ వనపర్తి శిరీష.. ఆమె భర్త లక్ష్మీనారయణలకు…
ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్నా.. వైరిపక్షాల మాదిరి తగువులాడుకునే పరిస్థితి. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు మూడో నేత చేరారట. పార్టీ కేడర్‌లో చాలా మంది ఆ నాయకుడి దగ్గరకు వెళ్తుండటం చర్చగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా నాయకులు? నకిరేకల్‌లో నేతి విద్యాసాగర్ భేటీలపై చర్చ..! చిరుమర్తి లింగయ్య. 2018లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మారిన…
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా భావించిన ఆ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా పార్టీ గెలుపు రుచి చూడలేదు. పల్నాడు రాజకీయాలకు కేంద్రమైనా టీడీపీ నెగ్గుకు రాలేని పరిస్థితి. అందుకే స్థానిక తెలుగు తమ్ముళ్లు కొత్త పాట పాడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. వరస ఓటములతో నరసరావుపేటను విడిచిపెట్టిన కోడెల ఫ్యామిలీ..! గుంటూరు జిల్లా నరసరావుపేట.. పల్నాడు పౌరుషాలకు రాజకీయ వేదిక. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ ఆధిపత్యం. వరసగా అనేక పర్యాయాలు కోడెల…
దేవుళ్ల కంటే సమాజంలో వైద్యులకే ఎక్కువ విలువ. అందులోనూ ప్రభుత్వ డాక్టర్లు అంటే.. ఆ హోదాకు ఉండే గౌరవం ఇంకా ఎక్కువ. కానీ.. వైద్య వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో చక్కర్లు కొడుతున్నారు తెలంగాణలోని గవర్నమెంట్ డాక్టర్లు. ఎవరికి నచ్చిన రాజకీయం వాళ్లు చేస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు. విభాగ అధిపతులకు కొరకరాని కొయ్యగా ప్రభుత్వ వైద్యులు..? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం సైతం కీలకంగా వ్యవహరించింది.…
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని… రాజకీయాలు మాట్లాడే భాష అస్సలు బాగోలేదని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని..…
విజయనగరం వైసీపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరు చినికిచినికి గాలివానగా మారుతోందా? ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నింటిని ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతోంది? బొత్స సొంత జిల్లాలో మేనల్లుడి హవా? విజయనగరం జిల్లా పేరు చెబితే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రంలేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స…
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రైతులకు మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకగా జరుగుతున్న…