ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని…
గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిర్మలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ వ్యాఖ్యానిస్తూ.. బీఆర్ఎస్ పాలనలో నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారన్నారు. బెయిల్‌పై బయటకి వచ్చాకే కేసీఆర్‌ను…
ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర…
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను…
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు..
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, భవిష్యత్తులో BRS అధికారంలోకి రావడంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “సింగిల్‌గా అధికారంలోకి వచ్చేది…
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు.