ఎప్పుడు ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ సారి ఏపీ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ నేతలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందుతుంటే అది బీజేపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వం పై ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆయన బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. Read Also: మహిళలను హింసించడం…
కరీంనగర్లో రేపు రాత్రి 9 గంటల నుంచి 3 జనవరి ఉదయం 5 గంటల వరకు జాగరణ చేయాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హజరవుతారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు, పోలీసులకు, టీచర్లకు బదిలీలకు సంబంధించిన 317 జిఓ ఉద్యోగ సంఘాలతో చర్చించి సవరించాలని డిమాండ్ చేస్తు జాగరణ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Read…
పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఏడాదికి రూ.18,000వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కేవలం 31లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందేవని, కేవలం జన్మభూమి కమిటీలు సూచించిన వారికి మాత్రమే ఇచ్చేవారని మంత్రి విమర్శించారు. Read Also: నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల నుంచి…
1. దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. 2.రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల ‘ఉచిత’ హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు. Read Also:ప్రధాన మంత్రి…
రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యత ఈ ఏడాది నుంచి మరింతగా పెరుగుతుందన్నారు. వైసీపీ పాలనకు 30 నెలలు పూర్తియిందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ వందకు వందశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. క్యాలెండర్ డేట్స్తో సహా అన్ని పథకాలను చెప్పినవాటి చెప్పినట్టుగా పూర్తి చేశామన్నారు. Read Also:ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సజ్జనార్…
సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1లక్ష829 రూపాయలు మాత్రమే నమోదయిందని కానీ 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 1లక్ష 24వేల 104 రూపాయాల తలసరి ఆదాయం, 2020-21 నాటికి 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని మంత్రి అన్నారు. Read Also: నాలుగో రోజు 6లక్షలకు పైగా ఖాతాల్లో…
జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదని..రాబోయేది జగన్ కు ఒడిదుడుకుల సమయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. జగనే కాకుండా ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదని పేర్కొన్నారు. ఎప్పుడూ వినని వందల రకాల మద్యం బ్రాండ్స్ వున్నాయని… అడిగే వాడే లేడని పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. మద్యం ప్రియులను దోచేస్తూ వారి నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుపుతున్నారు..కొన్న దానికన్నా పది రెట్లు ఎక్కువ చేసి మద్యాన్ని అమ్ముతున్నారని ఆగ్రహం…
ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని…
నేను సోనియా గాంధీ ,రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చానని జగ్గారెడ్డి అన్నారు.ఆ లేఖ ఎలా లీక్ అయిందో నాకు తెలియదని…ఇది మీడియాలో కూడా వచ్చిందని తెలిపారు. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు జగ్గారెడ్డిని హాజరు కావాలనడంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖ పై మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా..! లేదా మీరు మీడియా లో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా..ఈ విషయం మీరు ఎందుకు…