టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1.చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు.
2.తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ దళిత బంధును అందజేయాలని కార్యచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Also Read
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
- Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్‌లో ఫేమస్.. చేసేది మాత్రం..!
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
3.ఏపీలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 840 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,79,763 కి పెరిగిందిఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 501 కి చేరింది.
4.తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు..
5.దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు.
6 ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. బిసీలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అయితే..ఆయన్ను పదవీవీచ్చుతుణ్ని చేసిన సందర్భంలో, మరణించినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీసాయన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి. బీసీలంటే టీడీపీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు.
7.కరోనా, ఒమిక్రాన్ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. వీటి దెబ్బకు అన్ని వ్యాపారసముదాయాలు, విద్యాసంస్థలు ఇతర పనులు వాయిదా, లేదంటే మొత్తంగా మూత పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కరోనా,ఒమిక్రాన్ దెబ్బ అన్నింటి కన్నా ఎక్కువగా విద్యాసంస్థలపై పడింది. ఎప్పుడు ఏమౌవుతుందోనని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది.
8.గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు.
9 టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా తనికెళ్ళ భరణి సుపరిచితుడే. ఇక ఆయన శివుడిపై రాసే కవితలకు ఫ్యాన్స్ మాములుగా ఉండరు. అయితే చిత్ర పరిశ్రమలో ఉంటున్నామంటే ఎన్ని పురస్కారాలు ఉంటాయో.. అన్ని తిరస్కారాలు కూడా ఉంటాయి. ఎంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారో అంతేముంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. తాజగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తిట్టడం కాదు.. చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు.
10.దక్షిణాదిన సమంతకు స్టార్ హీరోయిన్ గా చక్కటి గుర్తింపు ఉంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్2’తో అటు ఉత్తరాదిలోనూ నటిగా చక్కటి ఇమేజ్ తెచ్చుకుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత పోషించిన నెగెటీవ్ రోల్ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బంది కలిగించినా ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గర చేసింది. ఇప్పుడు సమంత మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!