ఏపీ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇటీవల ఏపీసీఐడీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. గతంలో నమోదైన కేసుల్లో విచారణకు రావాలని ఈనెల 12న హైదరాబాద్‌లో తన నివాసంలో సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని… అందులో ఈనెల 17న విచారణకు రావాలని సూచించారన్నారు. అయితే తాను అత్యవసర పని మీద ఢిల్లీకి వచ్చానని… ఆరోగ్యపరమైన కారణాలతో వైద్యులను సంప్రదించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తాను…
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. Read Also: జంటనగరాల…
1.ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలకు ఎన్నిలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. 7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే ఆమ్ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు. 2.నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు జరిగిన జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.…
గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనకు సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. Read…
తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం తాను సీఎం జగన్‌ను కలిసి చర్చిస్తే తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారంటూ కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు GiveNewsNotViews అంటూ ఓ హ్యాగ్ ట్యాగ్‌ను చిరంజీవి తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ మై ఫుల్ సపోర్ట్ అంటూ చిరంజీవికి మద్దతు తెలుపుతూ…
గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు. Read Also: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడులకు దిగారు. అయితే ఈ సారి ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా…
కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను…
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను అక్రమాలు చేస్తే నిరూపించాలి ఒట్టి మాటలు మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. మా మామ కమ్యూనిస్టు కృష్ణారావు పేరు మీద ఎయిర్‌పోర్టు వద్ద 200 ఎకరాలు ఉన్నాయన్నారు. అది నిరూపిస్తే.. 200 ల ఎకరాలను ఆర్డీటీ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల…