ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు గుప్పించారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్…
బండి సంజయ్ చేసిన 317 జీవోను రద్దు చేయాలని చేసిన ఉద్యోగ దీక్షలో పోలీసులు బండి సంజయ్ని అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.. దీనిపై బండి సంజయ్ ప్రవిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. .బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ…
రేపటి నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించారు. దేశానికి బీజేపీ.. తెలంగాణకు టీఆర్ఎస్ ప్రమాదకరమన్నారు.బీజేపీ…టీఆర్ఎస్ రెండు పార్టీలు మాకు సమానమేనన్నారు. ఈ మధ్య కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం స్వాగతించదగిన అంశం అని ఆయన పేర్కొన్నారు. Read Also: సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో…
ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మిర్చిరైతుల సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు.మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా…
1.ఆంధ్రప్రదేశ్లో ఫిట్మెంట్, పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.. ప్రభుత్వ ప్రకటనతో భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనికోసం సోమవారం సీఎస్ను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు.. అయితే, మరోవైపు.. ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. 2.కొడాలి నాని పై వస్తున్న గుడివాడ కేసీనో..టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంశం పై మంత్రి పేర్ని…
కేంద్రం మీద నెపం నెట్టి గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నది గిరిజనులేనన్నారు. తెలంగాణ వచ్చిన మరునాడే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. Read Also: మరిన్ని రైళ్లలో జనరల్ టిక్కెట్లు పెంచే యోచనలో…
ఢిల్లీ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ నేత ప్రేమ కోసం రఘురామకృష్ణంరాజు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా.. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్లకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు…
కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్ర్తీలు, మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించేందుకు అనిమీయా ముక్త్ భారత్ పేరుతో పథకాన్ని అమలు చేస్తుందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. అనీమియా ముక్త్ భారత్ పథకాన్ని తెలంగాణలో నీరుగార్చాలని రాష్ర్ట ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కోటి పదిలక్షల మందుల స్టిప్స్, వైద్యపరికారాలను సేకరించే టెండర్లలో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా టీఎస్ఎంఐడీసీ వ్యవహారించింది. మేక్ ఇన్ ఇండియాను తుంగలో తొక్కి ఇతర దేశాల నుంచి వైద్య…
మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలినాని నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రత్నిస్తున్నారని నారాయణరావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న క్యాబినెట్.. కొత్త పీఆర్సీ జీవోలను ర్యాటిఫై చేయనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు కి ఆమోదం తెలపనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్.. కరోనా మహమ్మారి తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల పై ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..…