సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా… ఆరోగ్యం బాగోలేదని లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇటీవల ఏపీసీఐడీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. గతంలో నమోదైన కేసుల్లో విచారణకు రావాలని ఈనెల 12న హైదరాబాద్‌లో తన నివాసంలో సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని… అందులో ఈనెల 17న విచారణకు రావాలని సూచించారన్నారు. అయితే తాను అత్యవసర పని మీద ఢిల్లీకి వచ్చానని… ఆరోగ్యపరమైన కారణాలతో వైద్యులను సంప్రదించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తాను సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కావాలని లేఖలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.
రఘురామ విచారణకు హాజరుకాకపోవడంతో సీఐడీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆయన బెయిల్ షరతుల్లో సీఐడీ విచారణకు హాజరుకావాలని ఉంది. ఒకవేళ విచారణకు రఘురామ హాజరుకాకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్లి సీఐడీ పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎంపీ రఘురామ తనకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!