1.ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలకు ఎన్నిలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. 7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు.
2.నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘురామ ఆరోపించడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
3. యూపీలో బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్న వేళ రొటీన్ కి భిన్నంగా జరిగింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ త్వరలో బీజేపీ జెండా పట్టుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో సమాజ్వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు.
4.సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
5.సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. నటించేవారు పరిపాలించలేరు అనే ధోరణిని చాలామంది నటీనటులు తుడిచేశారు. ప్రస్తుతం ఎంతోమంది రాజకీయనాయకులు నటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక ఇందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
6.కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మళ్లీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. అయితే థర్డ్‌వేవ్‌లో ఎక్కువ మంది కరోనా బారినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
7.దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు రెండు లక్షల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చిస్తోంది.
8.తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది.
9.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డుప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. అంతటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం అంటే తేజు మళ్లీ పుట్టినట్లే.. ఆ ప్రమాదం నుంచి నెలా 15 రోజులు బెడ్ కే పరిమితమైన తేజు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుకున్నారు. అందరి దేవుళ్లు కరుణించి ఈ మెగా మేనల్లుడు స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ సెట్స్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు.
10.భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. గత ఏడాది టీ20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇది అనూహ్య నిర్ణయం. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు.