ఏపీలో పోలీసులపై మాజీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేదా వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అనే అనుమానాలు నెలకొన్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు…
ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏపీకి మూడు రాజధానులు అనే వైసీపీ ప్రభుత్వం చెప్పిందని.. తాజాగా మూడు రాజధానులు పోయి.. నాలుగో రాజధాని హైదరాబాద్ కూడా వచ్చి చేరిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనకు అన్ని విధాలుగా ఉపయోగపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవడానికి జగన్ ఏపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.…
అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం…
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి హరీష్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులు, అమరులను అవమానం చేసేలా ఉందని రేవంత్ ఆరోపించారు. 1200 మంది అమరులు అయితే 500 మందిని మాత్రమే గుర్తించారని.. అమరుల కుటుంబాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులను చివరి బడ్జెట్లో కూడా…
ఏపీలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె భర్త బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బ్రదర్ అనిల్ స్పందించారు. ఏపీ వేదికగా తాము కొత్త పార్టీ పెడుతున్నామన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కూడా బ్రదర్ అనిల్…
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అకారణంగా రేవంత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మంత్రి హరీష్రావు కేంద్రాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక్షస ఆనందం పొందారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత ఎన్నికల్లో తుడుచుకుపోయిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కుదరదన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి…
వైసీపీ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్గా విజయసాయిరెడ్డిని ఇటీవల సీఎం జగన్ నియమించగా.. అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ సభ్యత్వ నమోదులో ప్రతిఫలించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. తెలుగువారు…
ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు టూ అసెంబ్లీ సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే పాతూరు-గుండుగొలను హైవే మధ్యలో సైకిల్ యాత్ర చేస్తున్న రామానాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ ప్రమాదవశాత్తూ సైకిల్ నుంచి జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా నిమ్మల సైకిల్ నుంచి…