నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిణామాలపై నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి వారిని దూషించడం చాలా బాధకరమైన విషయమని.. అందులో మా సోదరి భువనేశ్వరీని తీసుకురావడం హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష చూస్తే కూడా అసహ్యం వేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్ అస్సాసియేషన్ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత…
గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిశారు. ఉప ఎన్నికల తరువాత తన ఎన్నిక కోసం కృషి చేసినవారిని కలుస్తున్న ఈటల.. అనుహ్యంగా ఎంపీ శ్రీనివాస్‌తో భేటీ అవడంతో.. రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిందని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. అంతర్యమేంటోనని టీఆర్‌ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు…
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ దుర్మార్గంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఏకగ్రీవాలు పెరిగాయని, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ…
అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల సోలోగా ఉప ఎన్నిక బరిలో దిగుతారని, సొంత పార్టీ పెడుతారంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. దీంతో ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ తగిలినట్లైంది.…