శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధించారు. నేటి ఉదయం ఉదయం 6 గంటల నుంచి రేపు ( గురువారం ) ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. కంకేర్లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.