Amit Shah: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుపై స్పందించిన అమిత్ షా.. పోలీసులు కేసు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా మాట్లాడడం మనం చూడొచ్చు. అయితే, రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ రెడీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఆ వీడియోను షేర్ చేస్తుంది. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్‌లో పేర్కొంది.
Read Also: Sakshi Dhoni: ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్!
Also Read
ఇక, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఎలాంటి కామెంట్స్ చేయలేదని బీజేపీ తెలిపింది. వైరల్ అవుతున్న వీడియో మొత్తం ఫేక్ అని చెప్పుకొచ్చింది. అసలు ఆ వీడియోలో తెలంగాణలోని ముస్లింలకు రాజ్యాంగానికి విరుద్ధంగా కల్పించిన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని కమలం పార్టీ స్పష్టం చేసింది. కావాలనే ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. ఇది పెద్ద ఎత్తున హింసకు దారి తీసే ఛాన్స్ ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల నుంచి డిలీట్ చేయాలని కోరింది.
Read Also: Haryana : ఆస్పత్రిలో ఉంచిన శవాన్ని తినేసిన కీటకాలు.. ఆందోళన చేసిన కుటుంబసభ్యులు
అయితే, దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ వింగ్ వీడియో ఏయే ఖాతాల్లో పోస్ట్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తుంది. ఈ మేరకు ఎక్స్, ఫేస్ బుక్‌లకు కూడా లేఖ రాసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ రియాక్ట అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది.. వారు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం పద్దతి కాదని అతడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!