Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులను వివరించేందుకు డీజీపీ ఆఫీస్ కి వచ్చామని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇక, పులివెందుల ఉప ఎన్నికలో జరుగుతున్న పరిణామాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం.. అయినా స్పందన లేదు.. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మా పార్టీ వారిని భయబ్రాంతులకు గురి చేసే కుట్ర చేస్తున్నారు.. మా పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని హత్య చేయాలని చూశారని ఆరోపించారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని ఎన్నికల్లో పని చేస్తున్నారు.. ప్రజాస్వామ్యం కాపాడుతుందనే నమ్మకంతో వైసీపీ ఎన్నికలకు వెళుతుంది.. మాపై దాడులు చేసి.. మాపైనే కేసులు పెడుతున్నారు.. ఇది న్యాయమా.. ధర్మమా అని అడుగుతున్నామని మేరుగు నాగార్జున ప్రశ్నించారు.
Read Also: Mahavatar : ఇంట్లో కూర్చొని 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయొచ్చు – దర్శకుడు అశ్విన్ కుమార్
ఇక, పోలింగ్ కేంద్రాలు మార్చారు.. ఇంత వరకు ఎన్నికల స్లిప్పులు పంచలేదు అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరపాలనేనా?.. పులివెందుల ఎన్నికల సందర్భంగా వందలాది మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా జరిగితే గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.