కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది..
ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వచ్చిన మెసేజ్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది కూరగాయల వ్యాపారి చేసిన పని అని వెల్లడైంది. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది..
Jagtial Crime: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఇవాళ పోలీసులకు లొంగిపోయాడు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు సంతోష్ అక్కడ అధికారులకు తానే గంగారెడ్డి హత్య చేసినట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్‌ల లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్లను మాదాపూర్ పోలీసులు చెక్ చేశారు.
Haripriya Naik: రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎవరు ఇంట్రెస్ట్ చూపించనప్పటికీ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ధర్నాలో పాల్గొనడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.