West Bengal Violence: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. అయితే, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ రావడం వల్లే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకూ 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also: AP Cabinet Postponed: ఏపీ కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా
ఇక, బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను తాతాల్కికంగా నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు దగ్గర ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి కోపం తెప్పించింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోగా.. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరగడంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.