TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరణించిన నక్కలపల్లి రాములు, దామరగిద్ధ కృష్ణ, శ్యామల సుజాత, జమీల్ అనే నలుగురు మృదేహాలకు చేవెళ్ల టౌన్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నారు.
Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో మహిళ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై Ntvతో మృతురాలు భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరమేశ్ తమను చంపుతాడని తెలుసు.. కులంతర వివాహం చేసుకోవడంతోనే అతను నాగమణిపై కక్ష్య పెంచుకున్నాడని పేర్కొన్నాడు.
Telangana Honour Killing: తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుందని లేడీ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్ దారుణంగా నరికి చంపేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఈ పరువు హత్య కలకలం రేపుతోంది.
Maoist: తెలంగాణ-ఛత్తీ్స్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నేటి (డిసెంబర్ 2) నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఓటింగ్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ని హ్యాక్ చేశాడని ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంల ఫ్రీక్వెన్సీని ట్యాంపరింగ్ చేయడం ద్వారా హ్యాక్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.. కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు.. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు.. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్…
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది.
Crime News: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన లివింగ్ ఇన్ పార్ట్నర్ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికిన ఘటన.. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లల్లో తిరుగుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు సోమవారం (నవంబర్ 26) ఎట్టకేలకు ఈ సీరియస్ కిల్లర్ ను పట్టుకున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలాను నిందితుడి యొక్క వివరాలను తెలిపాడు.