రాజేంద్రనగర్‌లో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది… బండ్లగూడ మల్లికార్జుననగర్‌లో అర్ధరాత్రి వినోద్ అనే వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు.. ఓ ఇంటిపై దాడి చేసిన వినోద్.. వృద్ధురాలితో పాటు మనుమడు జాన్ మెడిపై కత్తితో దాడి చేశాడు.. ఇద్దరూ పెద్దగా కేకలు వేయడంతో ఆ ఇంటికి స్థానికులు చేరుకున్నారు.. దీంతో.. దాడి చేసిన వినోద్ పారిపోయే ప్రయత్నం చేయగా… అతడిని వెంటాడి పట్టుకున్నారు కాలనీ వాసులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలి, ఆమె మనవడిని ఆసుపత్రికి తరలించారు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కత్తితో దాడి చేసిన వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.. అయితే, దుబాయ్‌లో ఉంటున్న వృద్ధురాలి కూతురు డబ్బులు అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించకపోవడమే దాడికి కారణంగా తెలుస్తోంది… డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతోనే వారిపై దాడి చేసినట్టు నిందితుడు.. పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Tags
- police
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!