హైదరాబాద్‌లో పోలీసులు వాహనాలపై దృష్టిసారించారు. నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనీఖీలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చలానాలను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ వద్ద ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా ఆ వాహనంపై దాదాపుగా 130 చలాన్లు ఉన్నాయి. టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ గల స్కూటీని చెక్ చేయగా 2017 నుంచి చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ చలానాల మొత్తం రూ.35,950 చెల్లించాలని పోలీసులు కోరారు. అందుకు వాహనదారుడు అంగీకరించకపోవడంతో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.